తిరుమలలో వైభవంగా శ్రీవారి ప్రణయ కలహోత్సవం
తిరుమలలో శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయ నోత్సవంలో 17వ రోజు తిరుమలలో ఈ ప్రణయ కలహోత్సవం నిర్వహించడం నిర్వహించడం ఆనవాయితీగా వస్థున్నది. ఇందులో భాగంగా శ్రీమలయప్ప స్వామి వారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వేంచాస్తారు. ఈలోపు అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిల్చుంటారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడిస్తారు.
Tirumala sri vari vaibavam
స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. ఇదే స్వామి అమ్మవార్ల ప్రణయ కలహోత్సవం. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామి వారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు భక్తుల నుండి అందుకుని ఆలయానికి చేరుతారు. ఆ తరువాత ఆస్థానాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీనమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింద - స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆలయంలో వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
Posted by: HelloTirupati.in is a website which discovers the craziness happening in the city and reveal it to the people of Tirupati. follow us on Facebook



